Site icon NTV Telugu

Ishan Kishan: పంత్ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఇషాన్ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో అతడు తన పేరిట కొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఒక వన్డేలో 7 సిక్సులు కొట్టిన రెండో భారత యంగెస్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డు ఉండేది. పంత్ 23 ఏళ్ల 173 రోజుల వయసులో ఒకే వన్డేలో ఏడు సిక్సులు కొట్టిన ఘనత సాధించగా.. ఇషాన్ కిషన్ మాత్రం 24 ఏళ్ల 83 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. రిషబ్ పంత్ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 40 బంతుల్లోనే ఏడు సిక్సులు కొట్టి 77 పరుగులు సాధించాడు.

Read Also: Nayanthara Surrogacy: చిక్కుల్లో నయన్ దంపతులు.. పిల్లలు ఎలా పుట్టారంటూ ప్రభుత్వం నోటీసులు

మరోవైపు రాంచీ వన్డేలో రాణించిన శ్రేయస్ అయ్యర్ కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20, వన్డే క్రికెట్‌లో కలిపి అత్యధికంగా నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ సరసన శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అటు చివరి ఆరు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ స్కోర్లు చూస్తే అతడు ఎంత ఫామ్‌లో ఉన్నాడో అర్ధమవుతుంది. అతడు చివరి ఆరు వన్డేల్లో 113 నాటౌట్, 50, 44, 63, 54, 80 స్కోర్లు సాధించాడు. అంతేకాకుండా వన్డే ఫార్మాట్‌లో టీమిండియా 300 విజయాలను నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో 257 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 247 విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

Exit mobile version