Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Ireland Bowler Josh Little Hatrick In T20 World Cup 2022

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్.. కివీస్‌పై దుమ్ముదులిపిన ఐర్లాండ్ బౌలర్

Published Date :November 4, 2022 , 4:24 pm
By Ramesh Nalam
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్.. కివీస్‌పై దుమ్ముదులిపిన ఐర్లాండ్ బౌలర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఈ హ్యాట్రిక్ సాధించడం విశేషం. టీ20ల్లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌పై పసికూన ఐర్లాండ్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేయడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 19వ ఓవర్‌లో జోష్ లిటిల్ బౌలింగ్‌కు దిగి వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్‌లను అవుట్ చేశాడు. ముందుగా 19వ ఓవర్ రెండో బంతికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. మిడిల్ స్టంప్ మీద పడి ఇన్ స్వింగ్ అయిన బంతిని విలియమ్సన్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. అయితే గాల్లోకి లేచిన ఆ బంతి నేరుగా డెలానీ చేతుల్లో వాలింది.

Read Also: T20 World Cup: సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్

అటు అదే ఓవర్ మూడో బంతికి జేమ్స్ నీషమ్ అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్‌‌పై పిచ్ అయిన బంతిని నీషమ్ ఆడలేకపోయాడు. బంతి నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. దీంతో అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి శాంట్నర్ కూడా అదే తరహాలో అవుటయ్యాడు. దీంతో ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా జోష్ లిటిల్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే శ్రీలంకపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బౌలర్ కార్తీక్ మయప్పన్ తొలి హ్యాట్రిక్ సాధించాడు. కాగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఐదుగురు బౌలర్లు హ్యాట్రిక్ తీశారు. 2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ బంగ్లాదేశ్‌‌పై హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో హ్యాట్రిక్ 2021లో నమోదైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ బౌలర్ క్యాంఫర్ ఈ ఘనత సాధించాడు. ఇదే టోర్నీలో శ్రీలంక బౌలర్ హసరంగ కూడా హ్యాట్రిక్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై హసరంగ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • hatrick
  • ireland
  • josh little
  • new zealand

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions