NTV Telugu Site icon

Yuzvendra Chahal: చాహల్ తిప్పేశాడు.. సరికొత్త చరిత్ర సృష్టించాడు

Chahal New Record In Ipl

Chahal New Record In Ipl

Yuzvendra Chahal Creates New Record In IPL: రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చాహల్‌ తాజాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఈ ఘనత సాధించాడు. ఏడో ఓవర్లో హ్యారీ బ్రూక్‌ను ఔట్‌ చేయడంత.. ఐపీఎల్‌లో చాహల్ 167వ వికెట్ సాధించినట్టు అయ్యింది. ఫలితంగా.. అతడు స్పిన్నర్లలో హయ్యస్ట్ వికెట్స్ తీసిన జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన చాహల్.. 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, 167 వికెట్లతో అమిత్‌ మిశ్రా రెండో స్థానంలో, 157 వికెట్లతో పియూష్‌ చావ్లా మూడో స్థానంలో, 157 వికెట్లతో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగో స్థానంలో, 153 వికెట్లతో సునీల్‌ నరైన్‌ స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తో పాటు ఇతర లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ కలుపుకొని.. టీ20ల్లో చాహల్ 300 వికెట్ల మార్క్‌ని కూడా అందుకున్నాడు.

IPL: ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 10 మంది ఆటగాళ్లు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వీ జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ అర్థశతకాలతో చెలరేగడంతో.. రాజస్థాన్ అంత భారీ పరుగులు సాధించగలిగింది. ఇక 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. టాపార్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. ఏ ఒక్కరూ కనీస పోరాట పటిమను కనబర్చలేకపోయారు. క్రీజులో వచ్చినట్టే వచ్చి, పెవిలియన్ బాట పట్టారు. ఒక దశలో వంద పరుగులు దాటుతుందా? అన్న అనుమానం కూడా కలిగింది. అయితే.. అబ్దుల్‌ సమద్‌(32 నాటౌట్‌), ఉమ్రాన్‌ మాలిక్‌(19 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో వంద పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

MI vs RCB: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చీల్చిచెండాడిన తిలక్

Show comments