NTV Telugu Site icon

Abhishek Sharma: అభిషేక్‌ శర్మ.. నీకు సమయం ఆసన్నమైంది!

Abhishek Sharma

Abhishek Sharma

Yuvraj Singh Lauds Travis Head Batting in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్‌ హెడ్‌ (89 నాటౌట్‌; 30 బంతుల్లో 8×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లక్నో బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడి.. పరుగుల వరద పారించారు. నువ్వా నేనా అని పోటీ పడుతూ బౌండరీలు, సిక్సులు బాదిన అభిషేక్‌, హెడ్‌.. ఉప్పల్‌ స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తారు. ఈ ఇద్దరి బ్యాటింగ్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మల బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. ‘అభిషేక్‌ శర్మ అద్భుతంగా ఆడావు. ఇలాగే నిలకడగా ఆడు, కాస్త ఓపికగా ఉండు. నీకు సమయం ఆసన్నమైంది’ అని యువీ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. త్వరలో భారత జట్టులోకి అభిషేక్‌ ఎంట్రీ ఇవ్వాలని యువరాజ్‌ ఆకాంక్షించాడు. ‘నా మిత్రమా ట్రావిస్‌ హెడ్‌.. నువ్ ఏ గ్రహం మీద బ్యాటింగ్ చేస్తున్నావ్. నమ్మశక్యంగా లేదు నీ బ్యాటింగ్’ అని ప్రశంసించాడు.

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడటం పక్కా!

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున అభిషేక్‌ శర్మ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి.. 401 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 205 స్ట్రైక్ రేట్‌తో అతడు పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్‌ వరుసగా 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28) రన్స్ చేశాడు. మరోవైపు ట్రావిస్‌ హెడ్‌ 12 మ్యాచ్‌లలో 533 రన్స్ బాదాడు.

Show comments