Site icon NTV Telugu

IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?

Pbks

Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ నిష్క్రమించడంతో.. పంజాబ్ జట్టు ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా ధావన్ సేన విజ‌యం సాధించా తీరాల్సిందే. మ‌రీ పంజాబ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుందా..? లేక ఢిల్లీ క్యాపిటల్స్ షాకిస్తుందా..? అనేది వేచి చూడాలి..

Also Read : Andhra Pradesh Crime: యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కింగ్స్ సెకండ్ ఓవర్ లోనే పెద్ద షాక్ త‌గిలింది. ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో రిలీ రోసో క్యాచ్ అందుకోవ‌డంతో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ (7) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 10 ప‌రుగులకే(1.2వ ఓవ‌ర్‌) తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ( 4 )ను కూడా ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 32 ప‌రుగులకే(4.1వ ఓవ‌ర్‌) పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్లకు పంజాబ్ స్కోరు 38/2గా నిలిచింది.

Also Read : Punjabi Mother : మదర్స్ డేకి వెరైటీ గిఫ్ట్ అడిగిన పంజాబీ మదర్

క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ కూడా ఎక్కువ సేపు గ్రౌండ్ లో నిలవలేక పోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో జితేశ్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 45 పరుగులకే (5.4వ ఓవ‌ర్‌) పంజాబ్ మూడో వికెట్ ను కోల్పోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు 10 ఓవర్లకు 66 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. క్రీజులో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 27 ( 31 ) తో పాటు సామ్ కర్రన్ 12( 14 ) ఉన్నారు.

Exit mobile version