Site icon NTV Telugu

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సచిన్ ట్వీట్ వైరల్!

Srh Ipl 2024

Srh Ipl 2024

Sachin Tendulkar Heap Praise on SRH Batting: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. బ్యాటింగ్‌లో తడబడుతూ బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడేది. అద్భుత బౌలింగ్‌తో 130-150 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో మాత్రం అంతా తారుమారైంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోతోంది. మెరుపు ఇన్నింగ్స్‌లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీ20లో 200 పరుగులు కాదు.. 300 కూడా ఈజీగా చేయొచ్చని నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరంభం చూస్తే 300 కొట్టేస్తుందనుకున్నా.. మధ్యలో తడబడి 266కు పరిమితమైంది. ఐపీఎల్ 2024లో ఇప్పటికే 3 సార్లు 260లకు పైగా స్కోర్ చేసింది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ను చూసి ప్రతిఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా సన్‌రైజర్స్‌ ఆట పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Also Read: Prabhas: ప్రభాస్‌ ఫుల్ బిజీ.. రెండేళ్లు ఆగాల్సిందే!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ ఓ ట్వీట్ చేశాడు. ‘ఇంతకీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఏం జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 260కి పైగా స్కోరును మూడుసార్లు బాదారు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్‌ ఆట అద్భుతం. బాగా బ్యాటింగ్ చేశారు.ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలి మంచి ఆరంభాన్ని ఇస్తే.. షాబాజ్ అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. ఢిల్లీ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశారు. వైవిధ్యాలు బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి సన్‌రైజర్స్‌ బాగా ఆడింది’ అని సచిన్ పేర్కొన్నాడు.

Exit mobile version