Site icon NTV Telugu

RCB vs RR: శతకం బాదిన కోహ్లీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

Kohli

Kohli

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 184 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్ లో కోహ్లీకి ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.

Read Also: Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!

మరో ఓపెనర్ డుప్లెసిస్ (44) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు తప్ప.. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. మ్యాక్స్ వెల్ (1) ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. సౌరవ్ చౌహన్ (9), కెమెరాన్ గ్రీన్ (5) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్లో యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. బర్గర్ ఒక వికెట్ తీశాడు.

Read Also: Rajnath Singh: “రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్”.. రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలు..

Exit mobile version