ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ , యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మెరుపు ఆరంభం ఇచ్చాడు, తొలి ఆరు బంతుల్లోనే ఐదు సిక్సర్లు బాదాడు. వైభవ్ సూర్యవంశీ హైదరాబాద్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి, SRH బౌలర్లను చితకబాది కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో సిక్సర్ కొట్టి తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
ప్రఫుల్ హింజ్ వేసిన తొలి ఓవర్‌లోనే వరుసగా నాలుగు సిక్సర్లు బాది, ఆ తర్వాత కమిన్స్‌ను కూడా వదల్లేదు. ఆరు సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గత మ్యాచ్‌లో తనను డకౌట్ చేసిన అదే హైదరాబాద్ బౌలర్ బౌలింగ్‌లో వైభవ్ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. అంతేకాకుండా, కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి బంతికే ఒక సిక్సర్ బాదాడు. వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 12 సిక్సులు బాదాడు.
