Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ ని పక్కన పెట్టేస్తారా.. ద్రవిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా.. ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది. తొలి మ్యాచ్, తొలి బంతికే సిక్సర్ బాది తన పొటన్షియాలిటీని చూపించాడు. అదే దూకుడును కొనసాగించి హాఫ్ సెంచరీ చేరువలో అవుటయ్యాడు. కానీ తాను ఓ ఐపీఎల్ ప్లేయర్నన్న విషయమే మరిచిపోయి గుక్క పెట్టి ఏడ్చుకుంటూ మైదానం వీడాడు. దాంతో కొందరు వైభవ్ పై విమర్శలు చేశారు. తొలి మ్యాచ్ లోనే ఇంత ఓవరాక్షన్ పనికిరాదంటూ కామెంట్స్ చేశారు. కానీ తన మూడో మ్యాచ్ లో భారీ సెంచరీతో అందరి నోళ్లు మూయించాడు. 17 బంతుల్లో 50, 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్ని ఆకర్షించాడు.
Read Also: Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?
అయితే, ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ.. రెగ్యులర్ కెప్టెన్ సంజూ స్థానంలో ఆడుతున్నాడు. సంజు గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో వైభవ్ కి తుది జట్టులో అవకాశం వచ్చింది. అయితే, సంజూ తిరిగి జట్టులోకి వస్తే వైభవ్ ని తప్పిస్తారా లేక సంజుకి ఇంకొన్నాళ్ళు విశ్రాంతి కల్పిస్తారా చూడాలి. ఈ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా సంజూ గాయంపై మాట్లాడిన ద్రవిడ్ సంజుకి మరి కొంతకాలం రెస్ట్ అవసరమని చెప్పుకొచ్చాడు. గాయం నయమవుతుందని, అయితే యాజమాన్యం సంజూ విషయంలో తొందరపడాలనుకోవట్లేదని పేర్కొన్నాడు. తొందర పడి జట్టులోకి తీసుకుని, సమస్యని మరింత పెంచాలనుకోవట్లేదన్నాడు.
Read Also: TDP vs Janasena: కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు!
మరోవైపు వైభవ్ పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలనుకోవట్లేదని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిద్ తెలిపారు. కానీ అతని టాలెంట్ ను ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్ చేసిన ఈ వ్యాఖ్యలను గమనిస్తే.. సంజూ ఇంకొంత కాలం విశ్రాంతి మోడ్ లోనే ఉండొచ్చని తెలుస్తుంది. కాగా, వైభవ్ కోసమే సంజుని పక్కన పెడుతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
