Anchor Anasuya Bharadwaj Reaction Goes Viral in SHR vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలివచ్చారు. సెలెబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్టేడియంలో చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు.
ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ మ్యాచ్ ఆసాంతం అనసూయ భరద్వాజ్ గ్యాలరీలో సందడి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఫోర్స్, సిక్స్‌లు బాదినపుడు అనసూయ ఎగిరి గంతేశారు. క్యాచ్‌లు వదిలేసినప్పుడు మాత్రం అయ్యో అంటూ బాధపడ్డారు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు ప్రయత్నించినా బంతి అందలేదు. ఆ సమయంలో అయ్యో అంటూ అనసూయ ఓ రియాక్షన్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయకు సంబందించిన మరిన్ని ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Sunrisers Hyderabad: ఆఖరి బంతికి వికెట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?
అనసూయ భరద్వాజ్ కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ యాంకర్‌గా చేశారు. ఆపై జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకర్‌గా వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలంలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, కథనం, ఎఫ్ 2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, పుష్ప, ఖిలాడి, దర్జా, రంగమర్తాండ, విమానం, రజాకార్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప 2లో లేడీ విలన్ దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
#Anasuya at IPL match #SRHvRR pic.twitter.com/TCxMfqWLPV
— Movies & Entertainment (@Movies_Ent_) May 2, 2024
#AnasuyaBharadwaj pic.twitter.com/td6HUd38p6
— Star Gallery (@stargallery2020) May 3, 2024
