Site icon NTV Telugu

DC vs LSG Dream 11 Prediction: ఢిల్లీ, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Ld

Ld

IPL 2024 Today Dream11 Prediction : ఐపీఎల్‌ 2024లో భాగంగా నేడు ఢిల్లీ క్యాప్టిల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న ఢిల్లీ.. లక్నోపై గెలవాలని చూస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్స్ గెలిచి కేవలం ఒక ఓటమిని ఎదుర్కున్న ఎల్‌ఎస్‌జీ.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.ఐపీఎల్‌లో ఢిల్లీ ఫై లక్నో కి మంచి ఆధిపత్యం ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో తలపడగ.. మూడు మ్యాచ్‌ల్లో లక్నో గెలవగా.. ఓ మ్యాచ్‌ వర్షం కర్ణంగా రద్దయింది.

Also Read; Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే.. నిమిషానికే టికెట్లు సోల్డ్‌ అవుట్‌!

అయితే ప్రస్తుత సీజన్‌లో బాటింగ్ మరియు బౌలింగ్ విభాగంలో రెండు టీమ్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. లక్నోకు మంచి బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. డికాక్‌, రాహుల్‌, పడిక్కల్‌, స్టోయినిస్‌, పూరన్‌, మయాంక్‌ యాదవ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మొహిసిన్‌ ఖాన్‌, రవి భిష్ణోయ్‌ జట్టులో ఉన్నారు. ఢిల్లీలో ఓపెనర్స్ వార్నర్,పృథ్వీ షా , పంత్, స్టుబ్స్ ,అక్షర్ పటేల్, ఝే రిచర్డ్‌సన్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ ఉన్నా ఇప్పటివరకు రాణించలేదు. మరి లక్నోతో మ్యాచ్‌లో ఢిల్లీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. లక్నో స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచులు రెండు జరగగా.. రెండిటిలో లక్నో గెలిచింది. ఇక లక్నో పిచ్‌ బౌలర్‌లకు, ముఖ్యంగా పేసర్‌లకు సహాయపడుతుంది.. ఇది ఢిల్లీ ప్లేయర్స్ కి కూడా ఉపశమనం కలిగించే విషయం, ఎందుకు అంటే వారికీ బలమైన బౌలింగ్ లైనప్ ఉంది.

తుది జట్లు (అంచనా):
ఢిల్లీ క్యాప్టిల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఝే రిచర్డ్‌సన్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్/సుమిత్ కుమార్. [ఇంపాక్ట్ సబ్: జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్]

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ (కీపర్), దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

డ్రీమ్ 11 టీమ్:
కీపర్ – రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్
బ్యాట్స్‌మెన్ – వార్నర్ (కెప్టెన్), పడికల్ (వైస్ కెప్టెన్), , లోకేష్ రాహుల్, పృథ్వీ షా
ఆల్ రౌండర్లు – అక్షర్ పటేల్,, కృనాల్ పాండ్యా,లలిత్ యాదవ్
బౌలర్లు – ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్

Exit mobile version