Tilak Varma: తొలి 19 బంతుల్లో 0.. తర్వాతి 23 బంతుల్లో విధ్వంసం.. తిలక్ బ్యాటింగ్ సాగిందిలా!
- తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్
- 45 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్
- తిలక్ బ్యాటింగ్‌లో మార్పు, ఓర్పు ప్రత్యేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని తిలక్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ, ఆపై సెంచరీ చేసి.. ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది నిలిచింది. ముఖ్యంగా తిలక్ బ్యాటింగ్‌లో మార్పు, ఓర్పు ప్రత్యేకంగా నిలిచింది. నెమ్మదిగా మొదలైన ఇన్నింగ్స్.. తుఫానుగా మారింది.
మొదటి 19 బంతుల్లో తిలక్ వర్మ చాలా జాగ్రత్తగా ఆడాడు. ఒక్క బౌండరీ కూడా లేకుండా సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 19 బంతుల్లో 19 పరుగులే చేశాడు. ఈ సమయంలోక్రీజ్లో నిలబడటం, పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవడం అతని ప్రధాన లక్ష్యంగా కనిపించింది. ఒత్తిడిలో ఉన్న జట్టుకు స్థిరత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో తిలక్ ఆచితూచి ఆడాడు. అయితే ఆ తర్వాత తిలక్ రెచ్చిపోవడంతో.. మ్యాచ్ రూపమే మారిపోయింది. తదుపరి 23 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు బాదుతూ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా రన్‌రేట్ పెంచి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పాడు. తిలక్ టైమింగ్, షాట్ సెలక్షన్, పవర్ హిట్టింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: Hardik Pandya: టైమ్అవుట్ సమయంలో తల తిరిగింది.. హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు!
తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రారంభంలో ఓపికగా ఆడి, సెట్ అయిన తర్వాత ఎదురుదాడి చేయడం. ఇదే గొప్ప బ్యాటర్ల లక్షణం. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకుని జట్టుకు అవసరమైన సమయంలో భారీ స్కోరు అందించాడు. తిలక్ ఆడిన ఈ ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. ఈ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు కీలక విజయం దక్కగా.. తిలక్ తనపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు కూడా అతను కీలక ఆటగాడిగా మారనున్నాడు.
తాజావార్తలు
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!