NTV Telugu Site icon

IPL 2023 : ఐపీఎల్ లో కీలక పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఢీ

Rcb Vs Mi

Rcb Vs Mi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే ఈ రెండు టీమ్స్ కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఇరు జట్లు కూడా తమ గత మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుంకు బరిలోకి దిగుతున్నాయి.

Also Read : Minister KTR: హైదరాబాద్ లో స‌మ‌స్య‌లు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి చవిచూడగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు మార్పులతో బరిలోకే దిగుతున్నట్లు సమాచారం. ఫిట్‌నెస్‌ లేమితో స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో ఇంగ్లీష్‌ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Also Read : The Kerala Story: మంత్రులతో కలిసి సినిమా చూడనున్న సీఎం యోగి.. మరోవైపు బెదిరింపులు

అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆనారోగ్యం కారణంగా దూరమైన తిలక్‌ వర్మ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసే అవకాశం ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అనుజ్‌ రావత్‌ స్థానంలో ప్రభ్‌దేశాయ్‌ ను టీమ్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు చెరో 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదు విజయాలు సాధించాయి.