ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్ లో గెలిచి సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. షాబాజ్ అహ్మద్ 18, క్లాసెన్ 10, చివరలో తెలుగబ్బాయి నితీశ్ కుమార్ 14 పరుగులు చేశాడు. సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీశారు.
Komati Reddy Venkat Reddy: నా పేరు తీసే అర్హత కేసీఆర్కు లేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తే..!
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్ లో శివం దూబే అత్యధికంగా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత రహానే 35, గైక్వాడ్ 26, చివరలో జడేజా 31 పరుగులు చేయడంతో 165 పరుగులు చేసింది. చివరలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ కు రావడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇక.. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్, ఉనాద్కట్ సమిష్టిగా బౌలింగ్ చేసి తలో వికెట్ సంపాదించారు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై కూడా నాలుగు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. రెండింటిలో ఓడిపోయింది.
