ఐపీఎల్ 2026 లో 36వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్టార్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలపై అందరి దృష్టి ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి పోరులో, ఇద్దరు బ్యాట్స్‌మెన్లు తమ ఖాతాను తెరవలేకపోయారు. ఈ సీజన్‌లో జరిగిన చివరి పోరులో సన్‌రైజర్స్, రాజస్థాన్‌ను 57 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌లలో హైదరాబాద్ నాలుగు గెలవగా, రాజస్థాన్ ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచింది.
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Srh Vs Rr