Sunrisers Hyderabad Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం (18-04-23) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 25వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలవగా, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లూ తమ రెండు మ్యాచుల్లో ఓడిపోగా.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. ఎవరు గెలుస్తారు? ఎవరు హ్యాట్రిక్ కొడతారు? అన్నది ఆసక్తిగా మారింది.
Vyshak Vijay Kumar: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. వైషాక్ చెత్త రికార్డ్
గత మ్యాచ్‌లో కోల్‌కతాపై సెంచరీతో శివాలెత్తిన హ్యారీ బ్రూక్.. అదే ప్రదర్శనను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ముంబై జట్టుకి మూడినట్టే! అతనితో పాటు కెప్టెన్ మార్ర్కమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరి పుణ్యమా అని.. ఎస్ఆర్‌హెచ్ జట్టు బ్యాటింగ్ విషయంలో కాస్త పటిష్టంగానే తయారైంది. బౌలర్లకూ మంచి అనుభవమే ఉంది కానీ, తడబాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే.. రెండు విజయాలు వరుసగా సాధించిన సన్‌రైజర్స్, మూడో మ్యాచ్‌లోనూ నెగ్గాలని పట్టుదలతో ఉంది. ముంబై కూడా అదే కసితో ఉంది. హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో బరిలోకి దిగింది. ఈ జట్టుకి సూర్య ఫామ్‌లోకి తిరిగి రావడం మంచి పరిణామమని చెప్పుకోవచ్చు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
RCB vs CSK: ధోనీ చేసిన పెద్ద తప్పు.. థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం.. ఆర్సీబీకి అన్యాయం
తుదిజట్లు:
హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, అర్జున్ తెందూల్కర్, డ్యూన్ జాన్‌సెన్, జోఫ్రా ఆర్చర్, షోకీన్, పీయూశ్ చావ్లా, నెహాల్ వధేరా
