ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై SRH గెలుపొందింది. 277 పరుగులు చేసిన హైదరాబాద్.. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 278 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఒకానొక క్రమంలో.. ఇంత భారీ లక్ష్యాన్ని ముంబై చేజ్ చేస్తుందా అనే సందేహం కలిగింది. ఈ మ్యాచ్ లో ప్రతీ ఒక్క బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా లోకల్ బాయ్ తిలక్ వర్మ 6 సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ ఉన్నంత సేపు సిక్సర్ల వర్షం కురిపించాడు.
Off The Record : లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ వ్యూహాలు
ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (34) పరుగులతో రాణించారు. ఆ తర్వాత నమన్ ధీర్ (30) పరుగులతో చెలరేగాడు. తిలక్ వర్మ (64) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (24), టిమ్ డేవిడ్ (42), షెఫర్డ్ (15) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్ లో జయదేవ్ ఉనాద్కట్, కమిన్స్ తలో రెండు వికెట్లు తీశారు. షాబాజ్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.
Off The Record : గుంటూరు వెస్ట్ టీడీపీలో గందరగోళం
అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసింది.ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (62) పరుగులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అభిషేక్ శర్మ (63) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఆ తర్వాత మార్క్రమ్ (42) పరుగులు చేశాడు. ఇక.. క్లాసెన్ మాత్రం ముంబై బౌలర్లను చీల్చి చెండాడు. కేవలం 34 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. ఇక.. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, కోయెట్జీ, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు. మిగిలిన బౌలర్లంతా పరుగులు ధార పోశారు.