ఐపీఎల్ 2024లో భాగంగా… సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్ల దూకుడును ఆపారు. ముఖ్యంగా.. శివం దూబే క్రీజులో ఉన్నంతసేపు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఒకానొక సమయంలో స్కోరు 200+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరును చేయనీయకుండా ఆపారు.
Congress: ఉత్తరాఖండ్‌లో స్టార్ క్యాంపెయినర్లు వీరే!
చెన్నై బ్యాటింగ్ లో శివం దూబే అత్యధికంగా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత రహానే 35, గైక్వాడ్ 26, చివరలో జడేజా 31 పరుగులు చేయడంతో 165 పరుగులు చేసింది. చివరలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ కు రావడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇక.. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్, ఉనాద్కట్ సమిష్టిగా బౌలింగ్ చేసి తలో వికెట్ సంపాదించారు.
Pemmasani Chandrashekar: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పెమ్మలసాని చంద్రశేఖర్ ప్రచారం
