Sunrisers Hyderabad Scored 58 Runs In First 10 Overs: ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నత్తనడకన తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. తొలి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి కేవలం 58 పరుగులే చేసింది. ఈ లెక్కన సన్‌రైజర్స్ గెలుపొందాలంటే.. మరో 10 ఓవర్లలో 87 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం తక్కువగా ఉందన్న నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఆది నుంచి సన్‌రైజర్స్ నిదానంగా ఆడుతోంది. ఈసారి చెలరేగిపోతాడనుకున్న హ్యారీ బ్రూక్ అయితే దారుణ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. 14 బంతులు ఆడిన అతగాడు కేవలం 7 పరుగులే చేసి ఔటయ్యాడు. అతనితో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన మయాంక్ అగర్వాల్ మాత్రం.. కొన్ని మెరుపులైతే మెరిపించాడు.
American Airlines: తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయుడు.. కానీ ట్విస్ట్
ఓవైపు బ్రూక్ బంతులు వృధా చేస్తుంటే.. మరోవైపు మయాంక్ అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ కాస్త ఊరట కలిగించాడు. ఇక బ్రూక్ వెళ్లిన తర్వాత సన్‌రైజర్స్ జోరు మరింత తగ్గిపోయింది. రాహుల్ త్రిపాఠి మరీ నెమ్మదిగా ఆడుతున్నాడు. మయాంక్ ఒక్కడే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతున్నాడే తప్ప.. త్రిపాఠి మాత్రం టెస్ట్ ఇన్నింగ్స్‌ని తలపించేలా నిదానంగా రాణిస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం.. చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారడం ఖాయం. లక్ష్యం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఆ ఒత్తిడిలో లక్ష్యం ఛేధించడమనేది మరింత కష్టతరంగా మారొచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించాలి. బంతులు వృధా చేయకుండా.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాలి. మరి.. వీళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.
