ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లక్నో ముందు 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అనుకున్నంత కాకపోయినా ఫైటింగ్ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పై ఆశలు పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ చెలరేగడంతో హైదరాబాద్ ఈ పరుగులు చేసింది.
Read Also: Venkatesh : ఆ క్రేజీ డైరెక్టర్ తో వెంకటేశ్ సినిమా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36), క్లాసెన్ (26), కమిన్స్ (18), హర్షల్ పటేల్ (11) పరుగులు చేశారు. హోంగ్రౌండ్‌లో ఆడుతున్న ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో 250+ పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ.. లక్నో అద్భుత బౌలింగ్‌తో 190 పరుగులకే కట్టడి చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
Read Also: Kathua Encounter: కథువాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి