NTV Telugu Site icon

Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎన్నెన్నో రికార్డులు సొంతం!

Srh Won

Srh Won

Highest Team Scores in IPL History: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) చరిత్ర సృష్టించింది. ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 178 సిక్స్‌లు బాదారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (165), కోల్‌కతా నైట్ రైడర్స్ (141), ఢిల్లీ క్యాపిటల్స్ (135), ముంబై ఇండియన్స్ (133), పంజాబ్ కింగ్స్ (120), రాజస్థాన్ రాయల్స్ (112), చెన్నై సూపర్ కింగ్స్ (107) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

287/3, 277/3 స్కోర్లతో టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ అరుదైన రికార్డు అందుకుంది. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (272/7) రెండో స్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ (266/7) నాలుగో స్థానంలో ఉంది. ఈ స్కోర్లు అన్ని ఐపీఎల్ 2024లోనే నమోదవడం విశేషం. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 స్కోరే అత్యధికం. పంజాబ్ కింగ్స్ (262/2), బెంగళూరు (262/7), కోల్‌కతా (261/6), ఢిల్లీ (257/4) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు టీమ్స్ ఈ స్కోర్లను ఐపీఎల్ 2024లో చేశాయి.

Also Read: IPL 2024: ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన ఐపీఎల్ 2024!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ద్వయం నిలిచింది. వీరు 220.2 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేశారు. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ (125 రన్స్) నమోదు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ రెకార్డుల్లోకెక్కింది. అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగానూ రికార్డు నమోదు చేసింది. పవర్ ప్లేలో అత్యధిక రన్ రేట్‌ (11.2), 167 లక్ష్యాన్ని 10 ఓవర్ల లోపే ఛేదించడం, తొలి 10 ఓవర్లలోనే 167 పరుగులు చేసిన మొదటి జట్టుగా ఆరెంజ్ ఆర్మీ రికార్డులు నెలకొల్పింది.