NTV Telugu Site icon

Kavya Maran: ఎగిరి గంతేసిన కావ్య మారన్.. క్యూట్ సెలబ్రేషన్స్ వైరల్!

Kavya Maran Happy Moments

Kavya Maran Happy Moments

SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ ఓనర్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ, సహా యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజస్థాన్ రాయల్స్‌ ఇన్నింగ్స్ చివరి బంతి అనంతరం ఎగిరి గంతేసి సంబరాలు చేసుకున్నారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆనందం పంచుకున్నారు. ఆపై పక్కనున్న వారితో కలిసి ఆమె సంతోషంలో మునిగితేలారు. కీలక మ్యాచ్‌లో కావ్య తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారు. కావ్యకు సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Lakshmi Manchu-Kannappa: ‘కన్నప్ప’లో నటించడం లేదు.. విష్ణు అవకాశం ఇవ్వలేదు!

వేలంలో కావ్య మారన్ అనుసరించిన వ్యూహాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ముందు కీలక మార్పులు చేశారు. విండీస్ దిగ్గజం బ్రియన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ స్పిన్‌ దిగ్గజం డానియల్‌ వెటోరిని హెడ్ కోచ్‌గా కావ్య నియమించారు. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్‌ 2023ని అందించిన ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేశారు. అతడిపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు అప్పగించారు. కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చి పటిష్టం చేశారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇక ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలని, కావ్య పాప మోహంలో సంతోషం అలానే ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Show comments