NTV Telugu Site icon

SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్‌.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!

Kohli Cummins

Kohli Cummins

Pat Cummins Trolls Virat Kohli ahead of SRH vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్‌ దిశగా దోసుకెళుతోంది. మరోవైపు ఆర్‌సీబీ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకటే గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. పరువు కోసం ఆర్‌సీబీ, ప్లే ఆఫ్‌ బెర్త్ లక్ష్యంగా ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

Also Read: SRH vs RCB: ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరూ! ఆర్‌సీబీకి కమిన్స్‌ వార్నింగ్‌

నేటి మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీ ప్లేయర్స్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం సాధన చేశారు. ప్రాక్టీస్ సందర్భంగా సన్‌రైజర్స్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్, బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రాక్టీస్ చేసి మైదానంలో రెస్ట్ తీసుకుంటున్న విరాట్ దగ్గరికి కమిన్స్‌ వచ్చి మాట్లాడాడు. ‘వికెట్‌ ఫ్లాట్‌గా ఉండేలా చేస్తానని మా కోచ్‌ చెప్పాడు. ఆ విషయం నేను విన్నాను’ అని కోహ్లీతో కమిన్స్‌ అన్నాడు. ‘నువ్వు చాలా మంచివాడివి ప్యాట్‌’ అని కోహ్లీ బదులిచ్చాడు. అనంతరం ఇద్దరు నవ్వుకున్నారు. ప్యాట్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది.

Show comments