NTV Telugu Site icon

SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్

Pat Cummins

Pat Cummins

Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్‌ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్‌’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్‌ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా గెలుస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం చెపాక్‌ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించి.. ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది.

మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఈ సీజన్‌ మొత్తం మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. జట్టులో మంచి ఉత్సాహం ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు దానిని సాధించాము. మా బలం బ్యాటింగ్ అని తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ అనుభవాన్ని మేం తక్కువ అంచనా వేయడం లేదు. టైటిల్ గెలవడం భువీ, నట్టూ, ఉనాద్కత్ డ్రీమ్. దాంతో నా పని మరింత సులువైంది’ అని చెప్పాడు.

Also Read: SRH vs RR: సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ రూల్.. షాబాజ్‌ అద్భుతం చేశాడు!

‘షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మా కోచ్ డానియల్ వెటోరి ఆడించారు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయితే బాగుంటుందని షాబాజ్‌ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాకు బిగ్ సర్‌ప్రైజ్. రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం. అభిషేక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో మాకు విజయం అందించారు. ఈ వికెట్‌పై 170 పరుగుల లక్ష్యం చేధించడం చాలా కష్టం. రెండు వికెట్లు తీస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశం ఉంటుందనుకున్నాం. అందరూ బాగా కష్టపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తాం’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.