NTV Telugu Site icon

Bhuvneshwar Kumar: చివరి ఓవర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్‌ కుమార్

Bhuvneshwar Kumar Srh

Bhuvneshwar Kumar Srh

Bhuvneshwar Kumar on SRH Last Over vs RR: చివరి ఓవర్‌ వేస్తున్నప్పుడు మైదానంలో ఎలాంటి చర్చ జరగలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ తెలిపాడు. చివరి ఓవర్లో తాను ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా బౌలింగ్ చేయాలనేదానిపై మాత్రమే దృష్టి సారించానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఎక్కువగా స్వింగ్‌ కావడం కూడా తమకు కలిసొచ్చిందని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. భువీ వికెట్ తీసి హైదరాబాద్‌కు థ్రిల్లింగ్‌ విక్టరీని అందించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని విజయాన్ని అందించిన భువనేశ్వర్‌ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం భువనేశ్వర్‌ మాట్లాడుతూ… ‘చివరి ఓవర్‌ వేస్తున్నప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. ఇది నా స్వభావం. ఆఖరి ఓవర్‌ వేసేటపుడు మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. నేను బౌలింగ్‌పైనే దృష్టి సారించాను. రెండు మంచి బంతులు పడితే.. ఫలితం మనకు అనుకూలంగా వచ్చేస్తుంది. ఈ మ్యాచ్‌లో ఎక్కువగా స్వింగ్‌ కావడం కూడా మాకు కలిసొచ్చింది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ.. 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Nitish Reddy: గెలుస్తామని అస్సలు అనుకోలేదు.. సూపర్‌ ఓవర్‌ ఆడుతామనుకున్నా: నితీశ్ రెడ్డి

‘ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఓ విధమైన ఆలోచనతో సిద్ధమయ్యా. కానీ మ్యాచ్‌లు జరిగే కొద్దీ.. బ్యాటర్లు దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. దీంతో నా బౌలింగ్‌లో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించా. ఈరోజు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసినా.. చివరలో పరుగులు ఇచ్చుకోక తప్పలేదు. సన్‌రైజర్స్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని భువనేశ్వర్‌ కుమార్‌ చెప్పాడు. చివరి ఓవర్‌లో రాజస్థాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికే స్లో ఓవర్‌ రేట్ కారణంగా సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉన్నారు. అయినా భువనేశ్వర్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.