NTV Telugu Site icon

Sanju Samson Out: అంపైర్‌తో గొడవ.. క్రీజ్‌ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!

Sanju Samson Out

Sanju Samson Out

Sanju Samson argues with filed umpire after controversial dismissal in DC vs RR: అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. అతడికి అండగా నిలిచే బ్యాటర్ కరువయ్యాడు. దాంతో సంజూ పోరాటం వృధా అయింది. అయితే ఈ మ్యాచ్‌లో సంజూ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. అసంతృప్తికి గురై ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

222 పరుగుల భారీ లక్ష్య చేధన‌లో రాజస్థాన్ రాయల్స్‌‌‌ కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సంజూ.. అనంతరం మరింత ధాటిగా ఆడాడు. అదే ఊపులో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లోని నాలుగో బంతిని సంజూ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్‌ వద్ద షై హోప్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో షై హోప్ బౌండరీ లైన్‌కు తాకినట్లు రీప్లేలో అనిపించింది.

Also Read: DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!

ఇది చూసిన సంజూ శాంసన్.. ఫీల్డ్ అంపైర్‌‌తో వాగ్వాదానికి దిగాడు. తాను అవుట్ కాదంటూ.. క్రీజ్‌ను వీడేందుకు నిరాకరించాడు. గురై అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఫీల్డ్ అంపైర్లు సర్దిచెప్పడంతో పెవిలియన్ చేరక తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్, మేనేజ్మెంట్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రిప్లేలను పదే పదే చూపించడంతో కాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments