Site icon NTV Telugu

IPL 2025 opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ వేడుక.. అలరించనున్న సల్మాన్ ఖాన్, దిశా పటానీ..!

Ipl Opening Cermoney

Ipl Opening Cermoney

ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మెగా పోరుకు ముందు.. బాలీవుడ్ స్టార్లతో కూడిన అద్భుతమైన వినోద కార్యక్రమం నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ కూడా పాల్గొంటారని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అలాగే.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తాజా సినిమా “సికందర్” ప్రమోషన్ కోసం ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. మొత్తానికే మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీతో పాటు మ్యాచ్ జరగడంపై సందేహం ఉండటంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. చూడాలి మరీ సాయంత్రం వరకు వరుణుడు ఏమైనా కరుణించి.. వర్షం పడకపోతే సెర్మనీ వేడుక, మ్యాచ్ సజావుగా జరగనుంది.

Read Also: Bala Veeranjaneya Swami: వాళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది..

కౌంట్‌డౌన్ ప్రోగ్రామ్ – 6:05 PM: సాయంత్రం 6:05 గంటలకు ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేక కౌంట్‌డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
6:13 PM: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అతని ప్రదర్శనతో ఈ వేడుకను ప్రారంభిస్తారు. ఆ తర్వాత.. శ్రేయ ఘోషల్ పాటలతో అలరించనున్నారు. దిశా పటాని కూడా తన అద్భుతమైన ప్రదర్శన కనబరచనుంది. చివరగా సింగర్ కరణ్ ఔజ్లా వేదికపైకి వచ్చి దిశాతో కలిసి ఓ పాట పాడనున్నారు.
6:52 PM: షారుఖ్ ఖాన్ మరలా వేదికపైకి రానున్నారు. ఈసారి ఆయన క్రికెటర్లను స్వాగతించి వారితో మాట్లాడుతారు. ఆ తర్వాత ఈ వేడుకలో క్రికెట్ మరియు గ్లామర్ ప్రాధాన్యతను చూపించనున్నారు.
6:53 PM: ఈ వేడుకలో BCCI అధికారులతో పాటు ఇతర ప్రముఖులు కూడా వేదికపై చేరుకుంటారు. దీంతో ఈ వేడుక అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది.
కెప్టెన్ల గ్రాండ్ ఎంట్రీ – 6:54 PM: ఈ వేడుకలో రెండు జట్ల కెప్టెన్లు ప్రత్యేక ఫ్లోట్‌లో వేదికపైకి రానున్నారు. వీరు షారుఖ్ ఖాన్‌తో వేదికపై తమ జట్ల విజయాల గురించి మాట్లాడతారు.
ఐపీఎల్ 18 కేక్ కటింగ్, బెలూన్ విడుదల – 6:59 PM: ఈ వేడుక చివరలో ఐపీఎల్ 18వ సీజన్‌కి సంబంధించిన కేక్ కట్ చేస్తారు. అనంతరం.. ఆకాశంలో బెలూన్లు వదిలేస్తారు.
డ్రోన్ షో – 6:59 PM: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో అద్భుతమైన డ్రోన్ షో కూడా ఉంటుందని సమాచారం. ఈ డ్రోన్ షో ఆకాశంలో అద్భుతం చేయనుంది.
బాణసంచా ప్రదర్శన – 7:00 PM: ఈ వేడుకలో చివరి ఘట్టంగా అద్భుతమైన బాణసంచా ప్రదర్శన ఉంటుంది. ఇది అందరినీ అలరించనుంది.
సీజన్ ఓపెనర్ – 7:30 PM: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన అనంతరం.. KKR, RCB మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఐపీఎల్ 2025లో జట్ల పోటీలు:
ఐపీఎల్ 2025లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లోని మ్యాచులు 13 వేదికలలో నిర్వహించనున్నారు. 12 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మార్చి 23న మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. రెండవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి.

ఓపెనింగ్ సెర్మనీ లైవ్:
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేడుకను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే.. జియోహాట్‌స్టార్ యాప్, ఇతర వెబ్‌సైట్ల ద్వారా కూడా లైవ్‌లో చూడవచ్చు.

Exit mobile version