Site icon NTV Telugu

RCB vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

Rr Vs Rcb

Rr Vs Rcb

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి మంచి జోరు మీదుంది రాజస్థాన్. కాగా.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే కొనసాగాలని చూస్తుంది. మరోవైపు.. బెంగళూరు నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆర్సీబీ చూస్తోంది. ఇక.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుఫున బ్యాటింగ్ ఆల్ రౌండర్ సౌరవ్ చౌహన్ ఎంట్రీ ఇస్తున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదర్, మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, సౌరవ్ చౌహన్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, దాగర్, టోప్లే, సిరాజ్, యశ్ దయాల్.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్:
జోష్ బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

Exit mobile version