NTV Telugu Site icon

RR vs RCB Eliminator 2024: ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్‌ఆర్‌ మ్యాజిక్‌ చేస్తేనే..!

Rr Vs Rcb Eliminator Ipl 2024

Rr Vs Rcb Eliminator Ipl 2024

Sunil Gavaskar Prediction on RR vs RCB Eliminator: ఐపీఎల్‌ 2024లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. లీగ్‌ స్టేజ్‌ సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన ఆర్‌సీబీ.. అదే ఊపులో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడిన ఆర్ఆర్.. గెలిచేందుకు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌ ఫలితంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు.

స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2024లో బెంగళూరు అద్భుతం చేసింది. లీగ్ ఆరంభంలో ఆర్‌సీబీ ప్రదర్శనను చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే ఆర్‌సీబీకి ఫ్యాన్స్‌ నుంచి క్రేజ్‌ మామూలుగా దక్కలేదు. ఫాఫ్‌ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు బాధ్యతతో ఆడుతూ.. కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఫాఫ్‌, కోహ్లీ జోడీ ఓపెనింగ్‌లో అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నారు. బౌలింగ్ కూడా బాగుంది. ఆర్‌సీబీ ప్రస్తుతం దూకుడు మీదుంది’ అని అన్నాడు.

Also Read: Donald Trump Biopic: మొదటి భార్య ఇవానాను రేప్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌!

‘రాజస్థాన్‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడింది. చివరి మ్యాచ్ ఒకటి రద్దైంది. గత వారంలో వారు ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఆర్ఆర్ ఆటగాళ్లకు సరైన సాధన లేదనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫయర్‌లో చేసిన మ్యాజిక్‌నే ఆర్‌ఆర్‌ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మరోసారి ఏకపక్ష మ్యాచ్‌ను చూడాల్సి వస్తుంది. దూకుడు మీదున్న ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకపోతే ఆశ్చర్యకరమే’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఆర్‌సీబీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సన్నీ చెప్పకనే చెప్పాడు.

Show comments