Site icon NTV Telugu

CSK vs RCB: 6155 రోజుల తర్వాత చెపాక్‌లో ఆర్సీబీ విజయం..

Rcb Won

Rcb Won

ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి కేవలం 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. రచిన్ రవీంద్ర (41) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత కెప్టెన్ గైక్వాడ్ డకౌటయ్యాడు. దీపక్ హుడా (4), సామ్ కరన్ (8) ఫెయిల్ అయ్యారు. శివం దూబే (19) ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ (11) పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా (25), చివరలో మహేంద్ర సింగ్ ధోని (30*) మెరుపులు మెరిపించాడు. 2 సిక్సులు, 3 ఫోర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్ ఉడ్ 3 వికెట్లు పడగొట్టాడు. యష్ ధయాళ్, లివింగ్‌స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకి చెత్త రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో ఈ స్టేడియంలో మ్యాచ్ గెలిచిన కోహ్లి టీమ్.. ఆ తర్వాత 16 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెపాక్ స్టేడియం ఈ రెండు జట్లు 9 మ్యాచ్ లాడాయి. సీఎస్కే 8 గెలవగా.. ఆర్సీబీ ఒకటి మాత్రమే నెగ్గింది. తాజాగా ఈ మ్యాచ్‌ విజయంతో 17 ఏళ్ల వెయిటింగ్‌కు ఆర్సీబీ ఎండ్ కార్డు వేసింది.

Read Also: Off The Record : తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? రేవంత్‌ వ్యూహం మార్చారా.. దూకుడు తగ్గించారా?

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ 32 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 31, దేవదత్ పడిక్కల్ 27 పరుగులు సాధించాడు. చివరలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు.. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మతీషా పతిరాన 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

Read Also: VijayDevarakonda : ఎన్టీఆర్ అన్నను అడిగితే ఏదీ కాదనడు : విజయ్ దేవరకొండ

Exit mobile version