NTV Telugu Site icon

RCB vs PBKS: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. పంజాబ్ పై బెంగళూరు గెలుపు

Rcb Won

Rcb Won

ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తన మొదటి గెలుపును నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. చివరలో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు మహిపాల్ లోమ్రార్ కూడా కేవలం 8 బంతుల్లో 17 పరుగులు చేయడంతో బెంగళూరు గెలుపు బాటలో పయనించింది. ముఖ్యంగా ఈ గెలుపుకు కారణం విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు. 49 బంతుల్లో 77 పరుగులు చేయడంతో గెలుపు బాటలకు పునాదులు వేశాడు. ఇక.. ఆర్సీబీ బ్యాటింగ్ లో డుప్లెసిస్ (3), కామెరాన్ గ్రీన్ (3) పరుగులు చేసి నిరాశపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రజత్ పాటిదర్ (18) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మ్యాక్స్ వెల్ (3) పరుగులకే ఔటయ్యాడు. అనుజ్ రావత్ (11) రన్స్ చేశాడు.

Read Also: Virat Kohli: కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో రెండు

పంజాబ్ బౌలింగ్ లో కగిసో రబాడా, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ 1, సామ్ కరన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ (45) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (8) అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ (25), లివింగ్ స్టోన్ (17) పరుగులు చేశారు. సామ్ కరన్ (23), జితేష్ శర్మ (27) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. చివరలో శశాంక్ సింగ్ కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేసి పంజాబ్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇక.. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత యశ్ దయాల్, ఆల్జరీ జోసఫ్ చెరో వికెట్ సంపాదించారు. ఇక.. రేపటి (మంగళవారం) మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉండనుంది.

Read Also: Somu Veerraju: మాజీ అధ్యక్షుడి పోటీపై క్లారిటీ.. మంగళవారం అధికారిక ప్రకటన!