Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!
- రోహిత్ శర్మ 15 ఏళ్ల మైలురాయి
- హిట్‌మ్యాన్ ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాయిలు
- ముంబై ఇండియన్స్‌కు రోహిత్ అమూల్య సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 2008 నుంచి 2010 వరకు అప్పటి డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2011లో ముంబైలోకి వచ్చాడు. 2011 ఏప్రిల్ 10న ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇన్నేళ్లు ముంబైలోనే ఉన్నాడు. నేటికి ముంబైలో చేరి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రోహిత్ అభిమానులు ప్రత్యక పోస్టులు పెడుతున్నారు. ఈ 15 ఏళ్లలో హిట్‌మ్యాన్ ముంబై జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా నిలిచాడు. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాయిలు అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ప్రదర్శన అసాధారణం అనే చెప్పాలి. హిట్‌మ్యాన్ ముంబై తరఫున 230కి పైగా మ్యాచ్‌లు ఆడి దాదాపు 6,000 పరుగులు చేశాడు. ముంబై జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై తరఫున అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు 15 కంటే ఎక్కువ సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడిగా కూడా మరో ఘనత అందుకున్నాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 5 టైటిల్స్ గెలిచిన ఘనత అతడి సొంతం. హిట్‌మ్యాన్ నాయకత్వంలో ముంబై ఎన్నో కీలక మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా మార్చడంలో రోహిత్ పాత్ర ఎంతో కీలకం. కేవలం రన్స్ మాత్రమే కాకుండా.. తన ప్రశాంత నాయకత్వం, మ్యాచ్‌ను అర్థం చేసుకునే తీరు, యువ ఆటగాళ్లను ప్రోత్సహించే శైలి ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఏళ్ల ఈ ప్రయాణం అతని కృషి, ప్రతిభ, నిబద్ధతకు నిదర్శనం. రోహిత్ లెగసీ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!