Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
- ఎలిమినేటర్ పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్
- ముల్లాన్‌పూర్ వేదికగా హైదరాబాద్‌తో ఆర్ఆర్ ఢీ
- వైభవ్‌తో కలిసి ఫోటోకు పోజ్ ఇవ్వండి
- ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Funny Reply to Paparazzi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) సిద్ధమైంది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్ఆర్ తలపడనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 205/8 స్కోర్ చేయగా.. అనంతరం ముంబైని 175/9కే పరిమితం చేసింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఎలిమినేటర్ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై నుంచి ముల్లాన్‌పూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన పవర్ హిట్టింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్.. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకు కూడా ఫేవరెట్‌గా మారిపోయాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఫోటోగ్రాఫర్లు.. వైభవ్‌తో కలిసి ఒక ఫోటోకు పోజ్ ఇవ్వండి అని పరాగ్‌ను కోరారు. అయితే దీనికి పరాగ్ సరదాగా స్పందిస్తూ.. ‘మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా?’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కెప్టెన్ రియాన్ పరాగ్ అలా అనడంతో వైభవ్ సూర్యవంశి కాసేపు ఆశ్చర్యంగా చూశాడు. అయితే తర్వాత మళ్లీ చిరునవ్వుతో పాపరాజీలకు పోజులు ఇచ్చాడు. ఈ ఫన్నీ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్ జట్టులో బుడ్డోడికి పరాగ్ మద్దతుగా నిలుస్తున్నాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోయిన తర్వాత కూడా పరాగ్ అతడిని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్లో వైభవ్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ముంబై ఇండియన్స్‌పై గెలిచిన తర్వాత రియాన్ పరాగ్ జట్టు ప్రదర్శనపై స్పందించాడు. ‘ప్లేఆఫ్స్‌కు చేరడం సంతోషంగా ఉంది. కానీ ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ పిచ్‌పై ఇద్దరు బ్యాటర్లు ఒకేసారి నెమ్మదిగా ఆడితే కుదరదు. ఒకరు రిస్క్ తీసుకోవాలి. మరొకరు క్రీజులో పాతుకుపోవాలి. జడేజా ఎప్పటిలాగే నమ్మకంగా ఆడాడు. చివర్లో కనీసం 20 పరుగులు చేస్తాడని నాకు తెలుసు.. అదే చేశాడు’ అని తెలిపాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఎలా రాణిస్తుందో చూడాలి. బుడ్డోడిపై మరోసారి అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!