NTV Telugu Site icon

RCB vs CSK: చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్కు ఆర్సీబీ

Rcb Won

Rcb Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (61) పరుగులతో రాణించాడు. డేరిల్ మిచెల్ (4), అజింక్యా రహానే (33) రన్స్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివం దూబే (7) పరుగులు చేశాడు. మిచెల్ సాంథ్నర్ (3) రన్స్ సాధించారు. ఆర్సీబీ బౌలింగ్ లో యష్ దయాళ్ కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ సంపాదించారు. ఈ మ్యాచ్ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా, సీఎస్కే ఇంటి బాట పట్టింది.

Garlic Peels: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..?

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు. కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేశారు. అత్యధికంగా.. కెప్టెన్ డుప్లెసిస్ 54 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక.. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తుషార్ దేశ్‌ పాండే, మిచెల్ సాంథ్నర్ తలో వికెట్ సంపాదించారు.