NTV Telugu Site icon

Virat Kohli-Umpires: సహనం కోల్పోయి.. అంపైర్‌లపై నోరుపారేసుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)!

Virat Kohlii Umpires

Virat Kohlii Umpires

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఆర్‌సీబీ ఒకే రన్ చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంలో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌లపై నోరుపారేసుకున్నాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విరాట్ వివాదస్పద రీతిలో అవుట్ అవ్వడమే ఇందుకు కారణం.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా వేశాడు. హర్షిత్ తొలి బంతిని విరాట్ కోహ్లీకి స్లో ఫుల్‌ టాస్‌గా సంధించాడు. బంతి కోహ్లీ ఛాతి కంటే ఎత్తులో రాగా.. అతడు డిఫెండ్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ తీసుకున్న బంతి.. అక్కడే గాల్లోకి లేచింది. హర్షిత్‌.. రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆన్ ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చారు. హైట్‌ నోబాల్‌గా భావించిన విరాట్.. అంపైర్‌ నిర్ణయాన్ని ఛాలెంజ్‌ చేస్తూ రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి డిప్ అయ్యిందని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

Also Read: Chess Candidates 2024: చరిత్ర సృష్టించిన భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్!

థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంతో వీడుతూ సహనం కోల్పోయిన విరాట్.. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ల వద్దకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. వారిపై గట్టిగా అరుస్తూ కోపంతో ఊగిపోయాడు. అది నో బాల్‌ అంటూ అసహనంతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నో బాల్‌ అని కొందరు, అవుట్ అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా విరాట్ అవ్వడం పెద్ద చర్చనీయాంశం అయింది.