NTV Telugu Site icon

Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా..!

Virat Kohli Sixes Record

Virat Kohli Sixes Record

Virat Kohli makes history in IPL: ఇప్పటికే ఐపీఎల్‌లో అనేక రికార్డులను తన పేరుపై లిఖించుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ.. మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున 250 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన కింగ్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆర్‌సీబీ తరఫున 245 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 250 సిక్స్‌లు బాదాడు.

ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 85 మ్యాచ్‌లు ఆడిన గేల్‌.. 239 సిక్స్‌లు బాదాడు. ఆర్‌సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 238 సిక్స్‌లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ 3లోని ముగ్గురు ఆర్‌సీబీ బ్యాటర్లే కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తరఫున 205 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 224 సిక్స్‌లు కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున 223 మ్యాచ్‌ల్లో కీరన్ పొలార్డ్ 189 సిక్స్‌లు బాదాడు.

Also Read: IPL 2024 PlayOffs: వరుస పరాజయాలు.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు!

ఇక ఐపీఎల్‌లో 250 సిక్స్‌లు మైలు రాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. తొలి స్ధానంలో విండీస్ దిగ్గజం క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. గేల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 357 సిక్స్‌లు బాదాడు. కేకేఆర్‌, ఆర్‌సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తరఫున యూనివర్సల్ బాస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మూడో స్ధానంలో రోహిత్‌ శర్మ (275) ఉన్నాడు. దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు రోహిత్ ఆడాడు. ఐపీఎల్‌లో విరాట్‌ ఒక్కడే కెరీర్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నాడు.