Glenn Maxwell Fans Trolls Parthiv Patel: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 36 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ ఆరంభంలో ఆడిన మ్యాక్సీ.. కొన్ని మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మూడు బంతుల్లో ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ స్పందించాడు.
‘గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడు ఐపీఎల్ చరిత్రలో ఓవర్ రేటెడ్ ప్లేయర్’ అని పార్థివ్ పటేల్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్టు చూసిన మ్యాక్స్‌వెల్ అభిమాని ఒకరు పార్థివ్‌పై బాడీ షేమింగ్ కామెంట్ పెట్టాడు. ‘ఎవరైతే 5.2 అంగుళాల కంటే తక్కువ ఉంటారో, ఆ వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకోరు’అని కామెంట్ చేశాడు. దీనిపై పార్థివ్ ఘాటుగానే స్పందించాడు. ‘నేను 5.3.. ఇప్పుడు నీకు సంతోషమేనా?’ అని రిప్లయ్ ఇచ్చాడు.
Also Read: Raju Yadav Trailer: ‘రాజు యాదవ్’ ట్రైలర్.. నవ్వులు పూయిస్తున్న గెటప్ శ్రీను ఫేస్!
గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరో అభిమాని కూడా పార్థివ్ పటేల్‌ను ట్రోల్ చేశాడు. ‘మ్యాక్స్‌వెల్ సాధించిన ట్రోఫీలు నీకంటే ఎత్తు’ అని పోస్టు పెట్టాడు. ‘ఇది ఒకసారి జరిగింది. ట్రోఫీ ఎప్పటికీ నాకంటే పెద్దదే’ అని రిప్లయ్ ఇచ్చాడు. అంతేకాదు 2024ను చూద్దాం అంటూ సవాల్ విసిరాడు. 2024 ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు కొడుతుందేమో చూద్దాం అని పార్థివ్ ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.