Site icon NTV Telugu

Faf du Plessis: చెలరేగిన డుప్లెసిస్.. 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ!

Faf Du Plessis Kohli

Faf Du Plessis Kohli

Fastest fifty for RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ బౌలర్లపై బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6వ ఓవర్ ఐదవ బంతికి జాషువా లిటిల్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ క్యాచ్ పట్టాడు. దాంతో 92 పరుగుల వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.

Also Read: RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!

ఈ హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2013లో పుణె వారియర్స్ ఇండియాపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 17 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. 2010లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాబిన్ ఉతప్ప 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2024లో హైదరాబాద్ టీంపై రజత్ పటిదార్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

Exit mobile version