Site icon NTV Telugu

Dinesh Karthik: నాకు బ్యాటింగ్‌ వస్తుందనుకోలేదు: దినేశ్‌ కార్తిక్‌

Dinesh Karthik Rcb

Dinesh Karthik Rcb

Dinesh Karthik Said I wasn’t mentally ready for Batting vs GT: చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండడంతో తనకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదనుకున్నా అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీపర్ దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు. వికెట్లను కోల్పోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లిపోయా అని డీకే తెలిపాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగాం అని దినేశ్‌ కార్తిక్‌ పేర్కొన్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో డీకే 12 బంతుల్లో 21 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ… ‘బెంగళూరు ఇన్నింగ్స్‌లో తొలి నాలుగు ఓవర్ల తర్వాత నేను ఓ కప్పు టీ తాగా. నేను మైదానంలోకి దిగాల్సిన అవసరం దాడులే అనుకున్నా. కాసేపటికి కాఫీ తెప్పించుకుని తాగాను. నేను ప్యాడ్లను కూడా కట్టుకోలేదు. బ్యాటింగ్ చేసేందుకు మానసికంగానూ సిద్ధంగా లేను. చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నా. మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా వికెట్లను కోల్పోయాం. వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లా. ఆరంభంలో ఆచితూచి ఆడాను. కుదురుకున్నాక పరుగులు చేశా. మా బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేశాం. ఈ మ్యాచ్‌ విజయంలో క్రెడిట్‌ బౌలర్లదే’ అని చెప్పాడు.

Also Read: Mohammed Siraj: గుజరాత్‌తో మ్యాచ్‌ ఆడతానని అనుకోలేదు: సిరాజ్‌

2008 ఎడిషన్‌ నుంచి దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 253 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4799 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 144 క్యాచ్‌లు, 36 స్టంప్‌ ఔట్లు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు డీకే ఆడాడు. ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 

Exit mobile version