Site icon NTV Telugu

RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

Rcb Vs Csk Playing 11

Rcb Vs Csk Playing 11

IPL 2026 RCB vs CSK Playing 11 in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు ఈరోజు తల్పడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, సీఎస్‌కేలు ఢీకొట్టనున్నాయి. ఐపీఎల్ 2026లో ఇది 11వ మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆర్‌సీబీ హోం గ్రౌండ్‌లో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫేవరేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది పేలవ ప్రదర్శన చేసిన సీఎస్‌కే.. ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది.

ఫామ్‌లో ఆర్‌సీబీ:
ఆర్‌సీబీ ఐపీఎల్ 2026 సీజన్‌ను అద్భుత విజయంతో ప్రారంభించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో బలంగా ఉంది. జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు కీలకంగా మారారు. ఇద్దరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. కెప్టెన్‌గా రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జితేశ్, డేవిడ్‌లు పెద్ద బలం. అయితే పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం ఉండటం ఆర్‌సీబీకి ఆందోళనగా మారింది. డఫీ, భువనేశ్వర్, సుయాశ్‌లతో ఆర్‌సీబీ నెట్టుకొస్తోంది.

సీఎస్‌కేకు విజయం తప్పనిసరి:
ఇక సీఎస్‌కే పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సీఎస్‌కేకు గాయాలు పెద్ద దెబ్బగా మారాయి. జట్టు కీలక ఆటగాడు ఎంఎస్ ధోని గాయం కారణంగా తొలి రెండు వారాలు దూరం అయ్యాడు. నాథన్ ఎల్లిస్ సీజన్ మొత్తానికి దూరం కాగా, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ గాయాలతో అందుబాటులో లేరు. దీంతో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబేలపై భారం పడుతోంది. సంజు మూడో మ్యాచ్‌లో అయినా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడుతాడో చూడాలి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమవుతున్న రుతురాజ్‌ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలర్లు నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీలు గాడిన పడాల్సి ఉంది.

హెడ్ టు హెడ్:
ఆర్‌సీబీ, సీఎస్‌కే హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచ్‌లలో చెన్నై 21 విజయాలతో ఆధిక్యంలో ఉంది. బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అయితే ఇటీవల కాలంలో ఆర్‌సీబీ కూడా బలంగా పోటీ ఇస్తోంది.

తుది జట్లు (అంచనా):
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ, జేకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: దేవదత్ పడిక్కల్.
సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అయుష్ మత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్.
ఇంపాక్ట్ ప్లేయర్: ఉర్విల్ పటేల్.

Exit mobile version