Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
- వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆనందానికి అవధులు లేవు
- ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar on RCB IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చారిత్రాత్మక విజయానంతరం మాట్లాడిన పాటీదార్.. ఆర్సీబీ కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని, ఇదంతా విధి రాసిన కథేనని భావోద్వేగంగా చెప్పాడు. ఫైనల్ విజయం అనంతరం స్పందించిన పాటీదార్.. అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు గత సీజన్ విజయానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపాడు. అయితే ఆ జ్ఞాపకాలలో మునిగిపోకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నాడు.
‘ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో నాకు మాటలు రావడం లేదు. చాలా గొప్పగా అనిపిస్తోంది. గత ఏడాది ఇక్కడ సాధించిన విజయాల జ్ఞాపకాలు ఉన్నప్పటికీ.. మేము పూర్తిగా వర్తమానంలోనే ఉండాలనుకున్నాం. అదే మాకు మరోసారి విజయాన్ని అందించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్‌ను పవర్‌ప్లేలోనే కట్టడి చేయాలనేది మా ప్రధాన ప్రణాళిక. అప్పుడు ఛేజింగ్ సులభమవుతుందని భావించాం. మా బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రమే కాదు, మొత్తం టోర్నీ అంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశంసించాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్, కృనాల్ పాండ్యా, సుయశ్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి ప్రతి బౌలర్ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
2022లో ఆర్సీబీ తరఫున ఆరంగేట్రం చేసిన తాను.. ఒకరోజు జట్టుకు కెప్టెన్‌గా మారి వరుసగా రెండు టైటిళ్లు అందిస్తానని ఎప్పుడూ ఊహించలేదని పాటీదార్ తెలిపాడు. ‘నిజం చెప్పాలంటే.. ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని నేను ఎప్పుడూ కల కూడా కనలేదు. ఇదంతా ముందే రాసిపెట్టిన విధి అనిపిస్తోంది. ఈ అవకాశానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. గత సీజన్లో టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి మేము టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడాం. అందరూ మంచి మానసిక స్థితిలో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం’ అని చెప్పాడు.
తన బ్యాటింగ్‌లో వచ్చిన మెరుగుదలకు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ (డీకే) వంటి సీనియర్ల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పాటీదార్ వెల్లడించాడు. ‘టోర్నీ ప్రారంభానికి ముందు నా సన్నాహకాలు చాలా బాగా జరిగాయి. ఫాస్ట్ బౌలర్లపై ఇంకా మెరుగ్గా ఆడేందుకు ఏ షాట్లు అభివృద్ధి చేసుకోవాలో విశ్లేషించుకున్నాను. టోర్నీ సమయంలో డీకే, కోహ్లీ భాయ్ సహా పలువురు ఆటగాళ్ల నుంచి విలువైన సూచనలు తీసుకున్నా. అవన్నీ నాకు ఎంతో సహాయపడ్డాయి. కోహ్లీ మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా ఎప్పుడూ జట్టుతోనే ఉంటాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్లు మాట్లాడటానికి సంకోచిస్తుంటారు. కానీ కోహ్లీ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడతాడు. వారికి ధైర్యం చెబుతాడు. అతని నాయకత్వ లక్షణాలు అద్భుతమైనవి’ అని ప్రశంసించాడు.
చివరగా ఆర్సీబీ అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చిన పాటీదార్.. జట్టు ఎక్కడ ఆడినా అభిమానులు తమ వెంట వచ్చి మద్దతుగా నిలిచారని గుర్తు చేశాడు. ‘మేము ఏ స్టేడియంలో ఆడినా అది మా హోం గ్రౌండ్లా అనిపించింది. అభిమానులు చూపిన ప్రేమ, మద్దతు అద్భుతం. ఈ విజయం పూర్తిగా అభిమానుల కోసమే. ఆర్సీబీ అభిమానులకు నా సందేశం ఒక్కటే… ‘ఈసారి కూడా కప్ మనదే’ అని చెప్పి పాటీదార్ సంబరాల్లో మునిగిపోయాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!