ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బౌలర్ల ముందు పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. చివరలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ అత్యధిక స్కోరు చేశాడు. కేవలం 16 బంతుల్లో 31 పరుగులు చేసి.. స్కోరును పెంచాడు.
MS Dhoni: 2011 వరల్డ్ కప్ నాటి ధోనీ ఫొటో.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
పంజాబ్ బ్యాటర్లలో అథర్వా థైడే (15), బెయిర్ స్టో (15), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (10), సామ్ కరన్ (6), జితేష్ శర్మ (29), శశాంక్ సింగ్ (9), లివింగ్ స్టోన్ (21), హర్ ప్రీత్ బ్రార్ (3) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. తక్కువ పరుగులకే కట్టడి చేశారు. రాజస్థాన్ బౌలింగ్ లో అవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ తలో వికెట్ తీశారు.
