NTV Telugu Site icon

MI vs RR: తడబడిన ముంబై.. రాజస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం

Mi

Mi

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. కాగా.. ఆరంభంలోనే ట్రెంట్ బౌల్ట్ 3 కీలక వికెట్ల తీసి శుభారంభాన్ని అందించాడు.

Read Also: Rishi Sunak: ఎన్నికల​ సర్వేల్లో రిషి సునాక్‌కు వచ్చిన రిజిల్ట్ ఇదే!

ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (16) పరుగులు చేయగా.. రోహిత్ శర్మ, నమన్ ధీర్, బ్రేవీస్ గోల్డెన్ డక్ పెట్టారు. ఆ తర్వాత తిలక్ వర్మ (32), హార్ధిక్ పాండ్యా (34) పరుగులతో రాణించారు. పీయూష్ చావ్లా (3), టిమ్ డేవిడ్ (17), కోయెట్జీ (4), బుమ్రా (8), ఆకాశ్ మద్వాల్ (4) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, యజువేందర్ చాహల్ తలో 3 వికెట్లు తీశారు. నాంద్రే బర్గర్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

Read Also: Saranya: స్టార్ నటిపై ఏడేళ్ల శిక్ష పడే కేసు.. పార్కింగ్ కోసం ఇంత రచ్చ చేశారా?