Rajasthan Royals Scored 214 In 20 Overs Against SRH: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ‘రాయల్’ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66) విజృంభించడం.. యశస్వీ జైస్వాల్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆర్ఆర్ అంత భారీ స్కోరు చేయగలిగింది. పాపం.. బట్లర్ 5 పరుగుల తేడాతో తన శతకం కోల్పోయాడు. చివర్లో సెంచరీ చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. భువనేశ్వర్ వేసిన యార్కర్‌ని పసిగట్టలేక, ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. సన్‌రైజర్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ఎస్ఆర్‌హెచ్‌కు అది సాధ్యం అవుతుందా?
Wrestlers Protest: కేంద్ర ప్రభుత్వానికి రైతుల అల్టిమేటం.. బ్రిజ్ భూషణ్ అరెస్టుకు మే 21 గడువు
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా.. జైస్వాల్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంతవరకూ బౌండరీల మోత మోగించేశాడు. ఓవైపు బట్లర్ సింగిల్స్ తీస్తూ మద్దతు ఇస్తుండగా.. జైస్వాల్ పరుగుల వర్షం కురిపించాడు. అయితే.. ఆ జోష్‌లోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ.. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇక కుదురుకున్నాక.. తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. బట్లర్ కూడా ఖాతా తెరిచాడు. ఇలా వీళ్లిద్దరూ పోటీపడి ఆడారు. ఎడాపెడా షాట్లతో ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆచితూచి ఆడుతూనే.. అనుకూలమైన బంతులు వచ్చినప్పుడు విధ్వంసం సృష్టించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Minister KTR : రేపు మంచిర్యాలలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
ఇక చివరివరకూ వీళ్లిద్దరే ఆడుతారని, బట్లర్ సునాయాసంగా సెంచరీ చేసుకుంటాడని అనుకుంటున్న తరుణంలో.. భువనేశ్వర్ షాకిచ్చాడు. బట్లర్ 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. యార్కర్ వేసి, ఎల్బీడబ్ల్యూగా అతడ్ని పెవిలియన్ పంపాడు. చివర్లో షిమ్రాన్ వచ్చినా.. ఎక్కువ భాగం సంజూనే బ్యాటింగ్ చేశాడు. చాలా ఊపుమీద ఉన్నాడు కాబట్టి, తనే స్ట్రైక్ తీసుకొని రప్ఫాడించాడు. దీంతో.. ఆర్ఆర్ స్కోరు 214/2కి చేరింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో చెరో వికెట్ తీసుకున్నారు. అయితే.. పరుగులు మాత్రం గట్టిగానే సమర్పించుకున్నారు. అత్యంత కీలక బౌలర్ మార్కండే అయితే.. తన 4 ఓవర్ల కోటాలో 51 పరుగులు ఇచ్చాడు.
