Site icon NTV Telugu

CSK vs PBKS: పంజాబ్ ముందు ఫైటింగ్ టార్గెట్.. చెన్నై స్కోరు ఎంతంటే..?

Csk

Csk

ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) పరుగులతో రాణించడంతో సీఎస్కే.. ఓ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 163 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను ఉంచింది.

Amit shah Fake video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. మరో పీసీసీ అధ్యక్షుడికి సమన్లు..

చెన్నై బ్యాటింగ్లో అజింక్యా రహానే (29) ఈ మ్యాచ్లో రాణించాడు. ఆ తర్వాత గైక్వాడ్ (62) పరుగులు చేశాడు. అత్యధికంగా గైక్వాడ్ రన్స్ చేశాడు. సిక్సర్ల దూబె డకౌట్తో నిరాశపరిచాడు. రవీంద్ర జడేజా (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి వచ్చిన సమీర్ రిజ్వీ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మొయిన్ అలీ (15), చివర్లో ధోనీ (14), డారిల్ మిచెల్ (1*) పరుగులు చేయడంతో 162 రన్స్ సాధించారు.

Yogi Adityanath: ‘‘అంత్యక్రియలకు నలుగురు కావాలి, కానీ’’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన యోగి..

పంజాబ్ బౌలింగ్లో హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ ఇద్దరు స్పిన్నర్లు సీఎస్కేను రన్స్ చేయకుండా కట్టడి చేశారు. వీరిద్దరూ చెరో రెండు కీలక వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

Exit mobile version