NTV Telugu Site icon

LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!

Punjab Won Match

Punjab Won Match

Punjab Kings Won The Match Against Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో మూడు బంతులు మిగిలుండగానే ఛేధించింది. మొదట్లో పంజాబ్ ఆడిన ఆటతీరు చూసి.. ఈ మ్యాచ్ చేజార్చుకుంటుందేమోనన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ.. అర్థశతకంతో సికందర్ రజా (57) చెలరేగడం, చివర్లో షారుఖ్ ఖాన్ విజృంభించడంతో పంజాబ్ గెలుపొందింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు తాండవం చేసి.. లక్నో నుంచి విజయాన్ని లాక్కున్నారు.

Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో తరఫున కేఎల్ రాహుల్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ (56 బంతుల్లో 74) ఆడాడు. ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన అతగాడు.. చివరివరకు ఒంటరి పోరాటం కొనసాగించాడు. మొదట్లో కైల్ మేయర్స్ (29) అతనికి కొంచెం సహకారం అందించాడు కానీ, మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడకపోవడంతో.. 159 పరుగులకే లక్నో పరిమితం అయ్యింది. ఇక 160 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి, మ్యాచ్ సొంతం చేసుకుంది.

Raghunandan Rao: రిజర్వేషన్‌లు ఇవ్వని కేసీఆర్‌కు.. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు

నిజానికి.. మొదట్లో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోవడం, స్కోరు కూడా నిదానంగా ముందుకు వెళ్తుండటం చూసి, పంజాబ్ గెలవడం కష్టమేనని అంతా అనుకున్నారు. టాపార్డర్‌తో పాటు స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో, ఇక పంజాబ్ ఓటమి తథ్యమని భావించారు. అలాంటి సమయంలో సికందర్ రజా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. క్రీజులోకి వచ్చిన మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆడిన ఇతడు, ఆ తర్వాత విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఇక చివర్లో వచ్చిన షారుఖ్ కూడా విధ్వంసం సృష్టించడంతో, పంజాబ్ విజయం సాధించింది.