NTV Telugu Site icon

GT vs PBKS: ఉత్కంఠపోరులో గుజరాత్ పై పంజాబ్ గెలుపు..

Pbks Won

Pbks Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన ఉత్కంఠపోరులో పంజాబ్ విజయం సాధించింది. చివరి బంతికి శశాంక్ సింగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ హీరో శశాంక్ సింగ్ (62*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి బంతికి విజయం సాధించింది.

Off The Record: తెలంగాణలో ‘టచ్’ పాలిటిక్స్ నడుస్తున్నాయా..?

పంజాబ్ బ్యాటింగ్ లో (62*) పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు విజయంలో పాత్ర పోషించాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (35), బెయిర్ స్టో (22), సికిందర్ రజా (15), జితేష్ శర్మ (16) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు కూడా చివరి వరకు మంచిగా బౌలింగ్ చేయడంతో.. మ్యాచ్ చివరకు ఉత్కంఠభరితంగా మారింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నల్కండే తలో వికెట్ సంపాదించారు.

Off The Record: ఓటమెరుగని ఆ టీడీపీ, వైసీపీ నేతలు.. ఇప్పుడు ఒకే సీటులో పోటీ.. గెలుపెవరిది..?

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ రాణించాడు. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు ఉన్నాయి. పంజాబ్ బ్యాటింగ్ లో సాహా (11), విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33), విజయ్ శంకర్ (8), చివరలో రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 23 పరుగులు చేయడంతో స్కోరు మరింత పెంచాడు. ఇక.. పంజాబ్ బౌలింగ్ లో రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.