NTV Telugu Site icon

MI vs PBKS: పంజాబ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ముందు భారీ లక్ష్యం

Pbks 20 Overs

Pbks 20 Overs

Punjab Kings Scored 214 In 20 Overs Against Mumbai Indians: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఊచకోత కోసింది. ముంబై బౌలర్లపై దండయాత్ర చేసి, పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ (82 నాటౌట్), జితేశ్ శర్మ (49 నాటౌట్) విజృంభించడంతో.. పంజాబ్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీకి 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, ముంబై అంత భారీ లక్ష్యాన్ని ఛేధించగలుగుతుందా?

Cyclone Mocha: వచ్చేవారం తూర్పుతీర రాష్ట్రాలకు ‘మోచా’ తుపాను ముప్పు..

తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ స్కోరు నత్తనడక సాగింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులే చేసింది. కానీ.. 11వ ఓవర్ నుంచి ఊచకోత మొదలుపెట్టింది. తర్వాతి 10 ఓవర్లలో పంజాబ్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, 136 పరుగులు చేసింది. జితేశ్ శర్మ, లివింగ్‌స్టన్ కలిసి ముంబై బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. వాళ్లిద్దరినీ గందరగోళానికి గురి చేసేందుకు ముంబై బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భారీ షాట్లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఇద్దరు.. ఎలాంటి బంతులు వచ్చినా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీ మోత మోగించేశారు. తొలుత జితేశ్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ప్రారంభించగా.. అతడ్ని చూసి లివింగ్‌స్టన్ కూడా రెచ్చిపోయాడు. ఈ ఇద్దరి ఆటతీరుని చూసి.. ముంబై బౌలర్లు ఒత్తిడికి గురై, ఆ ఒత్తిడిలో మరింత పేలవ బౌలింగ్ వేసి భారీ పరుగులు ఇచ్చేశారు. జితేశ్, లివింగ్‌స్టన్ కలిసి మూడో వికెట్‌కి ఏకంగా 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

Ancient Cities: భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన 10 పురాతన నగరాలు

ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. జోఫ్రా ఆర్చర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే, పంజాబ్ బ్యాటర్ల చేతిలో బలి అయ్యాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షద్ ఖాన్ మొదట్లో బాగానే కంట్రోల్ చేశాడు కానీ, ఆ తర్వాత పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతగాడు.. ఒక వికెట్ తీసి, 48 పరుగులిచ్చాడు. పియూష్ చావ్లా మాత్రమే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులే ఇచ్చాడు. మరి.. 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించగలదా? అంత భారీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. ముంబై బ్యాటర్లు మొదటి నుంచే రప్ఫాడించాల్సి ఉంటుంది.