Site icon NTV Telugu

Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?

Punjab Kings Record

Punjab Kings Record

Most Successful IPL Chases: ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ సవాలే. 200+ లక్ష్యాలను ఛేజ్ చేసేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అన్నిటినీ అధిగమిస్తూ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తే గానీ.. విజయం దక్కదు. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. 200కు పైగా లక్ష్యాలను అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబ్ ఇప్పటికే రికార్డు కలిగి ఉండగా.. ఆ సంఖ్యను తాజాగా మరింత మెరుగుపరుచుకుంది.

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి తన ఛేజింగ్ సత్తాను నిరూపించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో రెండు వికెట్స్ నష్టానికి 264 భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే పంజాబ్ ఆ లక్ష్యాన్ని ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. దాంతో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేజింగ్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 200కు పైగా లక్ష్యాలను మొత్తం 11 సార్లు ఛేదించింది. తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (6 సార్లు), రాజస్థాన్ రాయల్స్ (5 సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (5 సార్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (5 సార్లు) ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌కు ఈ రికార్డు కేవలం సంఖ్య మాత్రమే కాదు.. వారి దూకుడైన బ్యాటింగ్ శైలికి నిదర్శనం. భారీ లక్ష్యాలను కూడా సులభంగా ఛేదించే సామర్థ్యం ఈ జట్టుకు ఉందని మరోసారి ఢిల్లీ మ్యాచ్ ద్వారా రుజువైంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

200+ పరుగులను అత్యధిక సార్లు ఛేజ్ చేసిన టీమ్స్:
11 – పీబీకేఎస్
6 – ఎంఐ
5 – ఆర్ఆర్
5 – ఆర్‌సీబీ
5 – ఎస్‌ఆర్‌హెచ్

 

 

Exit mobile version