Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
- అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్
- 265 పరుగులను కూడా ఛేజ్ చేసిన పంజాబ్
- ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Successful IPL Chases: ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ సవాలే. 200+ లక్ష్యాలను ఛేజ్ చేసేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అన్నిటినీ అధిగమిస్తూ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తే గానీ.. విజయం దక్కదు. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. 200కు పైగా లక్ష్యాలను అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబ్ ఇప్పటికే రికార్డు కలిగి ఉండగా.. ఆ సంఖ్యను తాజాగా మరింత మెరుగుపరుచుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి తన ఛేజింగ్ సత్తాను నిరూపించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో రెండు వికెట్స్ నష్టానికి 264 భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే పంజాబ్ ఆ లక్ష్యాన్ని ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. దాంతో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేజింగ్‌లలో ఒకటిగా నిలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 200కు పైగా లక్ష్యాలను మొత్తం 11 సార్లు ఛేదించింది. తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (6 సార్లు), రాజస్థాన్ రాయల్స్ (5 సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (5 సార్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (5 సార్లు) ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌కు ఈ రికార్డు కేవలం సంఖ్య మాత్రమే కాదు.. వారి దూకుడైన బ్యాటింగ్ శైలికి నిదర్శనం. భారీ లక్ష్యాలను కూడా సులభంగా ఛేదించే సామర్థ్యం ఈ జట్టుకు ఉందని మరోసారి ఢిల్లీ మ్యాచ్ ద్వారా రుజువైంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
200+ పరుగులను అత్యధిక సార్లు ఛేజ్ చేసిన టీమ్స్:
11 – పీబీకేఎస్
6 – ఎంఐ
5 – ఆర్ఆర్
5 – ఆర్‌సీబీ
5 – ఎస్‌ఆర్‌హెచ్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!